

అమెరికా గతంతో పోలిస్తే మరింత బలంగా, మెరుగ్గా, సుసంపన్నంగా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. స్టేట్ ఆఫ్ ది యూనియన్ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేనివిధంగా వేగంగా పెరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో అమెరికాను ఇంకా మెరుగుపరుస్తామని, ఇది దేశానికి స్వర్ణయుగమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నాలుగేళ్లలో 1 ట్రిలియన్ డాలర్లకు కూడా తక్కువ పెట్టుబడులు తెచ్చిందని, తన కార్యవర్గం ఒక్క సంవత్సరంలోనే 18 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు సాధించిందని చెప్పారు. అక్రమ వలసలు, ప్రాణాంతక ఫెంటనిల్ ప్రవాహాన్ని సమర్థంగా అడ్డుకున్నామని తెలిపారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వాన్ని నిర్మిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. పౌరుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని చెప్పిన ఆయన, ఐదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని అత్యల్ప స్థాయికి తీసుకువచ్చామని వివరించారు. ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ద్వారా అమెరికన్లకు ఉపశమనం కలిగిస్తామని తెలిపారు. సుంకాలపై సుప్రీం తీర్పు దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూ, మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అంశాన్ని కూడా ప్రస్తావించారు. అక్రమ వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్ నిషేధించే చట్టానికి ఆమోదం తెలిపినట్లు చెప్పి, ‘సేవ్ అమెరికా’ చట్టాన్ని ఆమోదించాలని పిలుపునిచ్చారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!