

కార్తికేయ సినిమా మొదట్లో ఒక సాధారణ ప్రయత్నంలా మొదలైంది. కొత్త దర్శకుడు చందు మొండేటి, చిన్న నిర్మాత శ్రీనివాస్, హీరో నిఖిల్ కలిసి ఎన్నో కష్టాలతో ఈ సినిమాను పూర్తి చేశారు. సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఆ తర్వాత దానికి సీక్వెల్ చేయాలని దర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్ చాలా కాలం ప్రయత్నించారు. ఆలస్యమైనా చివరకు కార్తికేయ 2 తెరకెక్కింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది, ముఖ్యంగా నార్త్ ఇండియాలో పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆ తర్వాత దర్శకుడు చందు మొండేటి ఇతర ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. నిఖిల్ తన స్వయంభు సినిమాను పూర్తి చేసి, ప్రస్తుతం ఇండియా హౌస్ షూటింగ్లో పాల్గొంటున్నారు. చందు మొండేటి ప్రస్తుతం ఒక యానిమేషన్ సినిమా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కార్తికేయ 3 ఉంటుందా లేదా అన్న సందేహాలు వచ్చాయి.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చందు మొండేటి ఇప్పటికే కార్తికేయ 3 కథా లైన్ను సిద్ధం చేసుకున్నారు. నిఖిల్ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. కార్తికేయ సిరీస్కు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండటంతో, మార్కెట్ చేయడం సులభమని భావిస్తున్నారు. ప్రస్తుతం కథకు అవసరమైన బడ్జెట్, షూటింగ్ రోజుల సంఖ్య, ఇద్దరి కమిట్మెంట్లు అన్నింటిపై చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఓ నిర్ణయానికి వస్తే కార్తికేయ 3 త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!