

నందమూరి బాలకృష్ణ 66 ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో మరో సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఆయన 112వ సినిమా కానుంది.
మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి సినిమాలతో మంచి గుర్తింపు పొందిన వివేక్ ఆత్రేయ చెప్పిన కథ బాలయ్యకు నచ్చినట్లు సమాచారం. ఈ కొత్త కాంబోపై టాలీవుడ్లో ఆసక్తి పెరిగింది. బాలయ్యను కొత్తగా చూపించేందుకు వివేక్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు కురుక్షేత్రం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది పౌరాణిక సినిమానా లేక మాస్ కథానికనా అన్నది ఇంకా స్పష్టత లేదు. కథ పెద్దగా ఉండటంతో ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దసరా తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!