

బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్‌లో భారీ చిత్రం తెరకెక్కబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘సర్దార్ 2’ ఫేమ్ పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై స్పందించిన మిత్రన్.. సినిమా చర్చలు తుది దశలో ఉన్నాయని, నటీనటుల తేదీలు ఖరారైన తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
అడవి నేపథ్యంలో సాగే భారీ పౌరాణిక థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కథ, స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, 2026 నవంబర్‌లో ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, 2027 జనవరిలో షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పి.ఎస్. మిత్రన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుండగా, ధనుష్, కరీనా కపూర్ తొలిసారి కలిసి నటించనున్నారు. మరోవైపు గతంలో కరీనా కపూర్, సంజయ్ లీలా భన్సాలీ మధ్య వచ్చిన విభేదాల తర్వాత వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి చిత్రం ఇదేనన్న ప్రచారం కూడా ఆసక్తిని పెంచుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!