

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘జాంబీ రెడ్డి 2 నెక్ట్స్ లెవెల్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ‘జాంబీస్ ఆర్ బ్యాక్’ అంటూ భయానక దృశ్యాలతో ప్రారంభమైన వీడియోలో బతుకమ్మ పాటలు ఆకట్టుకోగా, జాంబీస్‌పై తేజ సజ్జా దాడి చేస్తూ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటి శనయా కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘రానా నాయుడు’ ఫేమ్ సుపర్ణ్ ఎస్. వర్మ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ అందించిన కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ అడ్వెంచర్ యాక్షన్ కామెడీ చిత్రం 2027లో తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, నేపాలీ, జపనీస్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘జాంబీవర్స్’ను మరింత విస్తరించి సరికొత్త అనుభూతిని అందించనున్నట్లు దర్శకుడు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!