

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’ మరోసారి ఆసక్తి రేపుతోంది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు పలు భాషల్లో రీమేక్ అయి ఘన విజయం సాధించాయి. ఇటీవల విడుదలైన ‘దృశ్యం 3’ మలయాళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ మలయాళ నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్ ‘దృశ్యం 4’ ప్రాజెక్ట్ ఉంటుందని ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.
‘దృశ్యం 4’లో ఐకానిక్ పాత్ర జార్జ్‌కుట్టిగా మోహన్‌లాల్ మరోసారి కనిపించనున్నారు. ఈ చిత్రానికి కూడా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నట్లు నిర్మాత వెల్లడించారు. ‘దృశ్యం 3’ తర్వాత కథను మరింత ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లేలా తదుపరి భాగాన్ని రూపొందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజా ప్రకటనతో ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘దృశ్యం 4’లో జార్జ్‌కుట్టి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందనే దానిపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!