

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలతో పాటు బి, సి సెంటర్లలోనూ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పలు కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నట్లు సమాచారం. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.24 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రవితేజ గత చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మొత్తం వసూళ్లను ‘ఇరుముడి’ ఒక్క రోజులోనే దాటేసిందనే టాక్ వినిపిస్తోంది.
కథనం, భావోద్వేగాలు, అయ్యప్ప స్వామి సెంటిమెంట్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచినట్లు తెలుస్తోంది. సాధారణ మాస్ చిత్రాలకు భిన్నంగా కథను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని సమాచారం. తొలి రోజే ఈ స్థాయి వసూళ్లు రావడంతో మొదటి వారాంతంలోనే బయ్యర్లు లాభాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో మరో భారీ విజయంగా నిలిచే దిశగా సాగుతోందనే టాక్ వినిపిస్తోంది. రానున్న రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!