

రాకింగ్ స్టార్ మంచు మనోజ్, తమిళ హీరో శింబు మధ్య ఉన్న స్నేహం ఇప్పుడు వెండితెరపై ప్రత్యేక కాంబినేషన్‌కు దారితీయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’లో శింబు కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మనోజ్‌కు అన్నయ్యగా శింబు నటించనున్నారని, అయితే ఆయన పాత్ర ప్రధానంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లకే పరిమితం కానుందని సమాచారం. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ దశలో ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఓ యోధుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ‘డేవిడ్ రెడ్డి’లో ‘వార్ డాగ్’ అనే ప్రత్యేక బైక్ మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. దాదాపు 700 కిలోల బరువున్న ఈ వాహనం సినిమాలో కీలకంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మనోజ్ సరసన ‘ప్రిన్స్’ ఫేమ్ మరియా హీరోయిన్‌గా నటిస్తోంది. శింబు గెస్ట్ రోల్‌లో కనిపిస్తే సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో శింబు పాత్రపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!