

ఓటీటీలో సంచలన విజయాన్ని అందుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘మీర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపైకి వస్తోంది. ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, పునీత్ కృష్ణ కథ అందిస్తున్నారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ తమ ‘కాలీన్ భయ్యా’, ‘గుడ్డూ భయ్యా’, ‘మున్నా భయ్యా’ పాత్రల్లో మరోసారి సందడి చేయనున్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 4న హిందీ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా నటి సోనాల్ చౌహాన్‌ను చిత్రబృందం పరిచయం చేసింది. ఆమె ‘ముంతాజ్ బీబీ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ముక్కుపుడక, లంగా ఓణిలో సోనాల్ కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘మీర్జాపూర్’ ప్రపంచంలోకి ముంతాజ్ బీబీ అడుగుపెట్టడంతో వెండితెరపై మరింత రచ్చ ఖాయమంటూ మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!