
సినిమాలు

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణలో వాస్తవాలు లేవని, అన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆడియో, వీడియో ఆధారాలను క్రమశిక్షణ కమిటీకి సమర్పించినట్లు మేఘారెడ్డి తెలిపారు.
క్రమశిక్షణ కమిటీ మరోసారి తనను పిలిస్తే పూర్తి వివరాలతో తన వాదనను వినిపిస్తానని చెప్పారు. చిన్నారెడ్డి బీఆర్‌ఎస్ నేతలతో కలిసి ఉంటున్నారని మేఘారెడ్డి ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!