
.webp&w=3840&q=75)
టాలీవుడ్లో వరుస విజయాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా సూపర్ హిట్ గా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ గ్రాండ్ విజయంతో అనిల్ రావిపూడి టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు.
ఇప్పటివరకు తొమ్మిది సినిమాల్లో అన్ని విజయాలు అందించాడని రికార్డు ఉన్న అనిల్, ఇప్పుడు తన 10 వ సినిమాను సంక్రాంతి 2027 కోసం ప్లాన్ చేస్తున్నాడు. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో హీరోగా విక్టరీ వెంకటేష్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీలో ప్రచారం. వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'F2', 'F3', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకున్నాయి. ముఖ్యంగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
తాజాగా, దగ్గుబాటి రానా కూడా కీలక పాత్రలో ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఇప్పటి వరకు రూమర్స్ మాత్రమే; అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. వెంకటేష్ - అనిల్ - రానా మల్టీస్టారర్ నిజమైతే... 2027 సంక్రాంతి టాలీవుడ్లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా మారడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!