

కృష్ణా జిల్లా కొక్కిలిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో పీ4 కార్యక్రమం కింద దాతల సహకారంతో రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 9, 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటిస్తూ, బాగా చదివి మంచి మార్కులు సాధించాలని ప్రోత్సహించారు. "మీరు మంచి మార్కులు తెచ్చుకుంటేనే నాకు కూడా మంచి మార్కులు వస్తాయి" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. విద్యార్థుల అభ్యాస పురోగతిని తెలుసుకునేందుకు తల్లిదండ్రులు తప్పనిసరిగా లీప్ యాప్ను వినియోగించాలని సూచించారు.
ఉపాధ్యాయులతో సమావేశమైన లోకేశ్, రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. అభ్యసన ఫలితాల మెరుగుదలపై దృష్టి పెట్టాలని, వెనుకబడిన విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు మెటీరియల్ అందజేస్తామని చెప్పారు. వచ్చే నెల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాల నాటికి ప్రతి తల్లిదండ్రి ఫోన్లో లీప్ యాప్ డౌన్లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!