9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య

Writer: Sreekanth Reddy 12:17 PM, 9 ఆగస్టు, 2026
హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య

రాజధాని హైదరాబాద్ నగరంలో ఓటర్ల సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే కారణంగా గ్రేటర్ పరిధిలో ఏకంగా 40 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేప‌టితో ఈ సర్వే కార్యక్రమం ముగియనుండగా, నిన్న‌టి వ‌ర‌కు ఉన్న సమాచారం ప్రకారం రాజధానిలోని మూడు జిల్లాల పరిధిలో ఉన్న 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు మూడో వంతు ఓట్లు రద్దయ్యే సూచనలు కనిపిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ సెలవులు ఉన్నప్పటికీ ఆది, సోమవారాల్లో బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) నుంచి ఉన్నతాధికారుల వరకు విధుల్లోనే ఉంటారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించని ఓటర్లు ఎవరైనా ఉంటే వెంటనే అందజేయాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి, ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓట్ల తొలగింపు ప్రభావం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇది అత్యధికంగా ఉంది. ముఖ్యంగా సనత్‌నగర్‌ నియోజకవర్గంలో మొత్తం 2,54,030 ఓట్లు ఉండగా, వాటిలో ఏకంగా 1.16 లక్షల ఓట్లు (45.68%) రద్దయ్యే అవకాశం ఉందని అంచనా. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లో 44.21%, ఎల్బీనగర్‌లో 42.19%, ఉప్పల్‌లో 40.05%, మహేశ్వరంలో 40.03% ఓట్లు జాబితా నుంచి తొలగిపోవచ్చని అధికారులు చెబుతున్నారు. అత్యల్పంగా ఇబ్రహీంపట్నంలో 21.43% ఓట్లు రద్దయ్యే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఈ సంఖ్యల్లో స్వల్ప మార్పులు మాత్రమే ఉండొచ్చని భావిస్తున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి, ఇతర అవసరాల కోసం ప్రతిరోజూ వేలాది మంది హైదరాబాద్‌కు వలస వస్తుంటారు. ఇక్కడే స్థిరపడి ఓటరుగా నమోదు చేసుకుంటారు. అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటరు సర్వే జరుగుతున్న నేపథ్యంలో.. సొంత ఊరితో పాటు హైదరాబాద్‌లోనూ ఓటు హక్కు ఉన్నవారు తమ ఓటును సొంతూరిలోనే కొనసాగించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో నగరంలో ఎన్యుమరేషన్ ఫారాలను చాలామంది అధికారులకు తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదే ఓట్ల సంఖ్య భారీగా తగ్గడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ

క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చింది - మోదీ

క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చింది - మోదీ

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం

ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి

ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి

H-1B వీసాదారులకు ట్రంప్‌ సర్కార్‌ షాక్?

H-1B వీసాదారులకు ట్రంప్‌ సర్కార్‌ షాక్?

ట్యాగ్లు
రాజధానిహైదరాబాద్జీహెచ్ ఎంసీఓటర్ల సంఖ్యసర్తెలంగాణసీఈసీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి
బిజినెస్

క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి

వివో ఎస్2 5జీ vs వివో వీ70 5జీ ఏది బెస్ట్?
టెక్నాలజీ

వివో ఎస్2 5జీ vs వివో వీ70 5జీ ఏది బెస్ట్?

'కైండా చిక్’ ట్రెండ్‌లో ప్రియాంక చోప్రా
సినిమాలు

'కైండా చిక్’ ట్రెండ్‌లో ప్రియాంక చోప్రా

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ
జనరల్

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ

క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చింది - మోదీ
జనరల్

క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చింది - మోదీ

‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ మాసీ ర్యాపో ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ మాసీ ర్యాపో ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్

హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య
జనరల్

హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ
జనరల్

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం
జనరల్

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం

సోషల్ మీడియాకు 'ప్రేమలు'  హీరోయిన్ గుడ్ బై
సినిమాలు

సోషల్ మీడియాకు 'ప్రేమలు' హీరోయిన్ గుడ్ బై

యంగ్‌గా కనిపించాలనే తాపత్రయం నాకు లేదు - మాధవన్‌
సినిమాలు

యంగ్‌గా కనిపించాలనే తాపత్రయం నాకు లేదు - మాధవన్‌

యశస్వితో మృణాల్  ప్రేమపై అసలు నిజం ఇదేనా?
గాసిప్స్

యశస్వితో మృణాల్ ప్రేమపై అసలు నిజం ఇదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!