
జనరల్

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివాసీ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా భావిస్తూ తమ సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సమాజాల సేవలను సీఎం కొనియాడారు. ప్రకృతితో మమేకమైన వారి జీవన విధానం ప్రపంచ నాగరికతకు ఎంతో విలువైనదని పేర్కొన్నారు.
తరతరాలుగా ప్రకృతి పరిరక్షణను జీవన విధానంగా మలుచుకున్న ఆదివాసీల జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, సమిష్టి జీవన విధానం యావత్ మానవాళికి మార్గదర్శకమని రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివాసీల హక్కులు, అస్తిత్వం, సంస్కృతిని గౌరవిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!