

దేశ అభివృద్ధికి మహిళా సాధికారతే బలమైన పునాది అని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఎం.సి.ఆర్. హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన ఏపీఎంఏఎస్ రజతోత్సవాలు మరియు “సమాజ ఆధారిత సమగ్ర అభివృద్ధి మార్గాలు” అంశంపై జరిగిన జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. మహిళలు, రైతులు, గ్రామీణ సమాజాన్ని సాధికారత దిశగా నడిపిస్తూ 25 ఏళ్లుగా ఏపీఎంఏఎస్ చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.
2025 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 17 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలు, 1.43 కోట్ల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానమై రూ.3.04 లక్షల కోట్లకు పైగా రుణాలు వినియోగించుకున్నాయని గవర్నర్ తెలిపారు. తెలంగాణలో ఏపీఎంఏఎస్ 6 లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలు, 23 వేల సమాఖ్యలు, 67 లక్షల మహిళా సభ్యులను బలోపేతం చేసిందన్నారు. అలాగే 2026 మార్చి 31 నాటికి స్త్రీనిధి ద్వారా 32 లక్షల మంది సభ్యులకు రూ.25 వేల కోట్లకుపైగా రుణాలు అందించగా, ప్రస్తుతం 86 రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా సుమారు 40 వేల మంది చిన్న, సన్నకారు రైతులకు మద్దతు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!