

అమెరికా లో స్టూడెంట్ వీసాలకు సంబంధించిన ఓపీటీ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై సుమారు 10 వేల మంది విదేశీ విద్యార్థులను గుర్తించినట్లు యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) వెల్లడించింది. వారిలో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా విదేశీ విద్యార్థుల వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది.
ఐసీఈ యాక్టింగ్ డైరెక్టర్ టాడ్ లైయోన్స్ ప్రకారం, విదేశీ విద్యార్థుల ప్రయోజనం కోసం రూపొందించిన ఓపీటీ విధానం కొందరి చేతుల్లో దుర్వినియోగానికి గురవుతోందని పేర్కొన్నారు. మోసాలు, గూఢచర్యం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో కొందరు విదేశీ విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎఫ్-1 వీసాపై అమెరికాలో స్టెమ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఓపీటీ ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. అయితే భారత్‌తో పాటు ఇతర దేశాల విద్యార్థులు ఈ విధానాన్ని హెచ్-1బీ వీసాలకు మార్గంగా వాడుకుంటున్నారని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!