
సినిమాలు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుకు యువ కళాకారిణి అన్నం మహిత అరుదైన, వినూత్న కానుక అందించారు. చీరాలకు చెందిన మహిత 70 పెన్సిల్ లెడ్స్‌పై చంద్రబాబు జీవిత చరిత్రను చిన్నచిన్న అక్షరాలతో సూక్ష్మంగా చెక్కారు. అనంతరం ఈ కళాకృతిని ఓ చిత్రపటంగా రూపొందించి కార్యక్రమంలో ముఖ్యమంత్రికి బహూకరించారు.
అరుదైన కానుకను చూసిన సీఎం చంద్రబాబు ఎంతో ఆనందం వ్యక్తం చేసి మహిత కళానైపుణ్యాన్ని అభినందించారు. యువతరం ఎంత వినూత్నంగా ఆలోచిస్తుందో చెప్పడానికి మహిత ఒక చక్కటి నిదర్శనమని ప్రశంసించారు. ఎంతో ఓర్పు, నైపుణ్యం అవసరమైన ఈ సూక్ష్మ కళాకృతిని రూపొందించినందుకు ఆమెను అభినందించారు. జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఈ ప్రత్యేక కానుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!