
జనరల్

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కార్యక్రమం వద్ద గందరగోళం ఏర్పడింది.
పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ఇరుపార్టీల నేతలను అడ్డుకున్నారు. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటోను కూడా ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. దీంతో కార్డుల పంపిణీ కార్యక్రమం రాజకీయ వివాదానికి దారి తీసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!