

బిగ్ బాస్ తెలుగు హౌస్‌లో నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ వ్యక్తిగత విభేదాలు బయటపడటంతో తీవ్ర వాగ్వాదాల మధ్య సాగింది. భైరవ టీమ్‌లోని సభ్యులకు ఒక్కొక్కరిని నామినేట్ చేసే అవకాశం ఇవ్వగా, సప్తశక్తి టీమ్ నుంచి నామినేషన్ పవర్ కోసం ఇద్దరిని ఎంపిక చేసుకోవాలని బిగ్ బాస్ సూచించారు. దీంతో త్రిగుణ్, నరేష్‌కు ఈ అవకాశం దక్కింది. నామినేషన్స్‌లో త్రిగుణ్ రోహిత్‌ను టార్గెట్ చేస్తూ.. ఒకే విషయాన్ని వ్యక్తులను బట్టి రోహిత్ వేర్వేరు విధాలుగా చూస్తున్నాడని విమర్శించాడు. దీనికి రోహిత్ కౌంటర్ ఇచ్చాడు. మరోవైపు నరేష్ అమన్‌ను నామినేట్ చేస్తూ.. తొలి వారాలతో పోలిస్తే ప్రస్తుతం అతడి ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందని, ఇంట్లో జరిగే పలు గొడవల్లో అతడి ప్రమేయం ఉంటోందని ఆరోపించాడు.
అమన్ తన నామినేషన్‌లో త్రిగుణ్‌ను ఎంచుకుని అతడి వ్యవహారశైలిపై విమర్శలు చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రం కాగా, త్రిగుణ్ తన మాటలపై వివరణ ఇచ్చి అనంతరం క్షమాపణ చెప్పాడు. కెప్టెన్ అపూర్వ కూడా త్రిగుణ్‌ను నామినేట్ చేస్తూ.. ఇతరులతో మాట్లాడే విధానం, వాగ్వాదాల్లో ఉపయోగించే మాటలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మిగిలిన నామినేషన్స్‌లో రామ్ ప్రసాద్ షాలినిని, రోహిత్ దేబ్జానీని, వర్షిణి సృష్టిని, వంశీ, సుధీర్ కలిసి చరణ్‌ను నామినేట్ చేశారు. దీంతో నాలుగో వారం నామినేషన్స్‌లో ముకేష్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, చరణ్, నరేష్, సృష్టి నిలిచారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!