

కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూనే హీరోగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బెయిల్’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ వడయార్ దర్శకత్వంలో, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ చిత్రంలో సాయి కుమార్, జయరామ్, దీక్షిత్ శెట్టి, సంజన ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న శివ రాజ్‌కుమార్ తన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘జైలర్ 2’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘జైలర్ 2’లో తనకు మరింత స్క్రీన్ స్పేస్ లభించడం ప్రత్యేకమైన విషయమని శివ రాజ్‌కుమార్ తెలిపారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ పాత్రలను డిజైన్ చేసిన తీరు, వాటిని తెరపై ఉపయోగించుకున్న విధానం ఎంతో ఆసక్తికరంగా, ఉత్సాహంగా ఉందని పేర్కొన్నారు. సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉందని, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. బ్లాక్‌బస్టర్ ‘జైలర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ను అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రజినీకాంత్, శివ రాజ్‌కుమార్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!