

ముంబైలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ముందుజాగ్రత్త చర్యగా ముంబైకి వెళ్లాల్సిన 12 విమానాలను గుజరాత్‌లోని సూరత్, వడోదర ఎయిర్‌పోర్టుల వైపు దారి మళ్లించారు. వీటిలో 8 విమానాలు సూరత్‌లో, 4 విమానాలు వడోదరలో సురక్షితంగా ల్యాండయ్యాయి. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత విమానాలను తిరిగి ముంబైకి పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. దారి మళ్లించిన విమానాల్లోని ప్రయాణికులకు మంచి నీరు, భోజనం, రిఫ్రెష్‌మెంట్స్ ఏర్పాటు చేశారు.
సూరత్‌కు దారి మళ్లించిన విమానాల్లో 5 ఇండిగోకు, 3 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందినవి ఉన్నాయి. వడోదరలో ల్యాండైన విమానాల్లో ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలతో పాటు మరో ఇండిగో విమానం ఉంది. ముంబైలో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు తీవ్ర గాలులు, మెరుపులు, ఉరుములతో వాతావరణం ప్రతికూలంగా మారిందని వడోదర ఎయిర్‌పోర్టు అధికారి తెలిపారు. ప్రయాణికులకు భోజనం, ఇతర రిఫ్రెష్‌మెంట్స్ అందిస్తున్నట్లు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!