
క్రీడలు

బీఆర్ఎస్ నేత హరీశ్ రావు నటుడు ప్రియదర్శిని అభినందించి సత్కరించారు. ‘బలగం’, ‘మల్లేశం’ చిత్రాల నుంచి ‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్నగా కేసీఆర్ పాత్రను పోషించే వరకు ప్రియదర్శి తన నటనతో ఆకట్టుకున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా ఆయన హావభావాలు, యాస, తెరపై కనిపించే తీరు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు.
‘ది ప్యారడైజ్’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నటుడు నాని సహా చిత్రబృందం మొత్తానికి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. ప్రియదర్శికి భవిష్యత్తులో మరిన్ని గుర్తుండిపోయే చిత్రాలు, గొప్ప విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా “చావు నోట్లో తల పెట్టయినా… మీకు గుర్తింపు తెస్తా!!” అనే సంభాషణను ప్రస్తావించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!