

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సాహితీ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ వ్యవహారాలతో గానీ, ఆ సంస్థకు సంబంధించిన ఇతర కార్యకలాపాలతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో తన బ్యాంకు ఖాతాకు సంబంధించిన రూ.2.1 కోట్ల లావాదేవీపై ఈడీ దృష్టి సారించిన నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. 2018లో కార్యాలయ స్థలం కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో తన బ్యాంకు ఖాతా ద్వారా సంస్థకు రూ.2.1 కోట్లు చెల్లించానని, అయితే సంస్థ స్థలాన్ని కేటాయించలేకపోవడంతో అదే మొత్తాన్ని తిరిగి తన ఖాతాలో జమ చేసిందని గాంధీ తెలిపారు.
ఈ చెల్లింపు, రీఫండ్ లావాదేవీలన్నీ పూర్తిగా బ్యాంకింగ్ మార్గంలోనే పారదర్శకంగా జరిగాయని, సంబంధిత బ్యాంకు లావాదేవీల రికార్డులు, అవసరమైన ఆధారాలను విచారణలో సమర్పిస్తానని గాంధీ చెప్పారు. వాస్తవాలను పూర్తిగా తెలుసుకోకుండా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. రూ.2.1 కోట్ల లావాదేవీపై వివరణ కోరుతూ ఈడీ గాంధీకి నోటీసులు జారీ చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!