

పారాక్వాట్ డైక్లోరైడ్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి స్వాగతించారు. మానవులు, జంతువులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందన్న కారణాలతో పారాక్వాట్ డైక్లోరైడ్‌కు కొత్త రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ, ఇప్పటికే మంజూరైన రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలను రద్దు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలను వెనక్కి తీసుకోవాలని రిజిస్ట్రేషన్ కమిటీని ఆదేశించడంతో పాటు, ఉత్తర్వుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది.
రైతుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైనదని కోదండరెడ్డి పేర్కొన్నారు. ప్రమాదకరమైన కలుపు మందులపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోనూ కేంద్ర ఉత్తర్వులను సమర్థవంతంగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ అవసరమైన చర్యలు చేపట్టాలని, రాష్ట్రంలో పారాక్వాట్ డైక్లోరైడ్ ప్రస్తుత పరిస్థితి, అందుబాటులో ఉన్న నిల్వలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని రైతు సంక్షేమ కమిషన్ సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!