

బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ఎఫ్‌ఎంసీజీ రంగంలోకి అడుగుపెట్టారు. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల బ్రాండ్ ‘ఫ్లక్స్ థియరీ’కి వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్న ఆయన ఐదు విభిన్న వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా రూపొందించిన షవర్ జెల్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అద్వయ్ ఝున్‌ఝున్‌వాలా, వెంచర్ బిల్డింగ్ సంస్థ థింక్9తో కలిసి ఈ బ్రాండ్‌ను రూపొందించారు. వ్యక్తిత్వం, భావోద్వేగాలను వ్యక్తిగత సంరక్షణతో అనుసంధానించే ఆలోచనతో ఉత్పత్తులను తీర్చిదిద్దారు.
ఫ్లక్స్ థియరీ ఆలోచన గురించి రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ తాను పోషించిన బర్ఫీ, బన్నీ, జోర్డాన్, అయాన్, శివ పాత్రలు తనలోని విభిన్న కోణాలను ప్రతిబింబిస్తాయని తెలిపారు. మనిషి ఎప్పుడూ ఒకే వ్యక్తిత్వంతో ఉండడని, రోజు, మూడ్, పరిస్థితులను బట్టి వ్యక్తిత్వం మారుతుందని చెప్పారు. ఇదే ఆలోచనను ఆధారంగా చేసుకుని ఫ్లక్స్ థియరీ బ్రాండ్‌ను రూపొందించినట్లు రణ్‌బీర్ వివరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!