
జనరల్

అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామానికి చెందిన భారత సైన్య జవాను రాపేటి పూర్ణచంద్రశేఖర్ (37) ప్రమాదవశాత్తూ మృతి చెందారు. భారత సైన్యంలో నాయక్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ప్రస్తుతం డెహ్రాడూన్‌లో సేవలందిస్తున్నారు. శుక్రవారం రాత్రి విధుల్లో భాగంగా ట్రక్కులో ప్రయాణిస్తుండగా, ఒక ప్రాంతంలో ఆర్చి ఒక్కసారిగా కూలిపడటంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో పూర్ణచంద్రశేఖర్తో పాటు నాగాలాండ్‌కు చెందిన మరో సైన్య ఉద్యోగి కూడా మృతిచెందారు. పూర్ణచంద్రశేఖర్కు భార్య, రెండేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. నెలన్నర క్రితమే కుటుంబాన్ని డెహ్రాడూన్‌కు తీసుకెళ్లిన ఆయన మృతితో వెంకుపాలెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!