
క్రీడలు

NEET విధానానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ మరోసారి తీర్మానం చేసింది. వైద్య విద్యలో ప్రవేశాలను NEET ఆధారంగా కాకుండా 12వ తరగతి మార్కుల ఆధారంగా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. NEET విధానం గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రతికూలంగా మారుతోందని పేర్కొంది.
ఖరీదైన కోచింగ్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులపై అదనపు భారం పడుతోందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే NEETలో అవకతవకలు, పరీక్ష నిర్వహణలో పారదర్శకతకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. ఇదే సమయంలో FCRA సవరణ బిల్లు-2026ను వ్యతిరేకిస్తూ మరో తీర్మానాన్ని కూడా అసెంబ్లీ ఆమోదించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!