

సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు వేగవంతమైన సహాయం అందించడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి షిఖా గోయల్ తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రగతి’ వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో కేంద్ర హోంశాఖ పరిధిలోని భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం డిజిటల్ వ్యవస్థల వినియోగం, పనితీరు ఆధారంగా తెలంగాణకు ఈ గుర్తింపు లభించిందని వెల్లడించారు.
దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర సైబర్ నేరాల సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, డిజిటల్ జీరో ఎఫ్‌ఐఆర్ విధానం అమలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, బాధితుల డబ్బు తిరిగి పొందే విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు తెలంగాణను అభినందించినట్లు షిఖా గోయల్ తెలిపారు. ప్రజల సహాయార్థం 8712665600 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే ఫిర్యాదు చేసి సహాయం పొందాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!