

ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (JUA) ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. రక్షణ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుంచి నోడల్ అధికారులను నియమించారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు సంబంధిత సంస్థల మధ్య సమన్వయం కోసం ఈ నియామకాలు చేపట్టారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్‌తో పాటు రక్షణ, పౌర అవసరాలకు ఉపయోగపడే జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ పరిణామంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
రక్షణ శాఖ ఆధ్వర్యంలో ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ సదుపాయాలు, విమానాల పార్కింగ్, డిస్పర్సల్ ప్రాంతాలు, వెదర్ షెల్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్లు, ఆపరేషనల్ కాంప్లెక్స్, శిక్షణ, మెయింటెనెన్స్ మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. పౌర విమానయానానికి సంబంధించి AAI సివిల్ టెర్మినల్, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (MRO) సదుపాయాలను అభివృద్ధి చేయనుంది. రక్షణ సిబ్బందికి నివాస, క్రీడా, వినోద సదుపాయాలతో పాటు నీటి సరఫరా, పారిశుద్ధ్య వసతులు కూడా కల్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు అమలును వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా నోడల్ అధికారిని నియమించాలని కిషన్ రెడ్డి కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!