

తెలంగాణను ప్రపంచ బియ్యం ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. బియ్యం ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లలో మరింత గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
బియ్యానికి విలువ జోడించడం ద్వారా రైతులకు రెట్టింపు ఆదాయం అందించవచ్చని మంత్రి అన్నారు. ఫోర్టిఫైడ్, మల్టీ విటమిన్ బియ్యం ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించిన ఆయన, తెలంగాణ మిగులు బియ్యం ఉత్పత్తి రాష్ట్రంగా ఎదిగిందని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!