

తెలంగాణలో అమలవుతున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు బుధవారం మధ్యంతర స్టే విధించింది. ఈ రెండు పథకాల చట్టబద్ధత, రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అమలు చేస్తున్న ఈ పథకాలకు రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టపరమైన ఆధారం లేదని పిటిషనర్ తన వాదనలో పేర్కొన్నారు.
పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు నిర్దేశించిన గడువులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో హైకోర్టు ఈ రెండు పథకాలపై నాలుగు వారాలపాటు మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కేసును తదుపరి విచారణకు వాయిదా వేసింది. ఈ పథకాల కింద అర్హులైన వధువులకు వివాహ సమయంలో ప్రభుత్వం ఒకసారి ఆర్థిక సహాయం అందిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!