
జనరల్

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నటి ప్రణీత సుభాష్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఆమె ‘భీమన అమావాస్య’ సందర్భంగా భర్త పాదాలకు పూజ చేసి నమస్కరిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలకు ‘భీమన అమావాస్య’ అని క్యాప్షన్ ఇవ్వడంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి.
భీమన అమావాస్య అనేది కర్ణాటకతో పాటు దక్షిణాదిలోని పలు ప్రాంతాల్లో సంప్రదాయంగా జరుపుకునే హిందూ పండుగ. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్య సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు, ఆచారాలు నిర్వహించి తమ భర్తల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తారు. ప్రణీత కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ పూజలు చేయడం ద్వారా భీమన అమావాస్య వేడుకలకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!