
జనరల్

‘పుష్ప’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి మరో అరుదైన ఘనత సాధించారు. 2024 సంవత్సరానికి ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి జాతీయ ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న ఆమె, తాజాగా అమెరికాలోని బోస్టన్ బర్క్‌లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో ఎన్‌సెంబుల్ ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ ఘనతతో పాటు సుకృతి వేణి పూర్తి స్కాలర్‌షిప్‌ను కూడా సొంతం చేసుకున్నారు. మొత్తం 272 మంది విద్యార్థులు ఆడిషన్‌కు హాజరు కాగా, కేవలం 14 మందికి మాత్రమే పూర్తి స్కాలర్‌షిప్ లభించింది. సింగర్స్ విభాగంలో ఎంపికైన ఏకైక విద్యార్థిగా సుకృతి వేణి నిలవడం విశేషం. నటనతో పాటు సంగీతంలోనూ ప్రతిభను చాటుకుంటూ ఆమె వరుస విజయాలను అందుకుంటున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!