

డీఎస్సీ-2025 నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విజయవాడలో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమతో పాటు పార్టీ నాయకులు చేరుకుని, అనుమతి లేకుండా దీక్షా శిబిరం ఏర్పాటు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.
దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ దీక్షా శిబిరంలోని టెంట్‌ను టీడీపీ శ్రేణులు తొలగించేందుకు ప్రయత్నించగా, వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ నెలకొంది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనుమతి లేకుండా ధర్నా నిర్వహిస్తున్నారనే కారణంతో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!