

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ప్రత్యేకమైన అప్‌డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం ప్రకటించడంతో బన్నీ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే ప్రకటన సమయం, అందులో ఉండే వివరాలను నిర్మాణ సంస్థ గోప్యంగా ఉంచడంతో సర్ప్రైజ్ ఏంటనే ఆసక్తి నెలకొంది. ఎలాంటి ఆలస్యం లేకుండా అప్‌డేట్‌ను వెల్లడించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సన్ పిక్చర్స్‌ను కోరుతున్నారు.
ఈ సినిమాలో దీపికా పడుకోణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కోసం అట్లీ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ డాన్ చుట్టూ కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం అట్లీ ప్రత్యేకంగా కొన్ని గెస్ట్ రోల్స్‌ను కూడా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజా అప్‌డేట్ నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!