
సినిమాలు

చెట్లు, ఇళ్లపై గెంతుతూ తిరిగిన ఓ కోతి అలసిపోయి విశ్రాంతి కోసం ఓ బార్బర్‌షాప్‌లోకి వెళ్లింది. అక్కడ ఉన్న కుర్చీపైకి ఎక్కి హాయిగా కూర్చుంది. కోతిని బయటకు పంపించేందుకు ప్రయత్నించకుండా.. షాప్ యజమాని దాని వద్దకు వెళ్లి మసాజ్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆ కోతి కళ్లు మూసుకుని కుర్చీలో రిలాక్స్‌గా పడుకుని మసాజ్‌ను ఆస్వాదించింది.
ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన వీడియోను నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మంకేశ్ భాయ్ మసాజ్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.. దయచేసి డిస్టర్బ్ చేయొద్దు’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోతికి మసాజ్ చేసిన తర్వాత బిల్లు ఎవరు చెల్లిస్తారంటూ ఓ నెటిజన్ సరదాగా కామెంట్ చేయగా.. మరికొందరు కూడా తమదైన శైలిలో స్పందించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!