

నకిలీ మందుల విక్రయాలపై కర్ణాటక ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన 16 మంది రిటైలర్లు, హోల్సేలర్ల ఔషధ లైసెన్సులను రద్దు చేసి, మరో ఎనిమిది లైసెన్సులను సస్పెండ్ చేశారు. బిడది-డొడ్డేరి ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆగస్టు 18న నిర్వహించిన తనిఖీల్లో అనుమానిత నకిలీ, గడువు ముగిసిన మందులతో పాటు ప్యాకింగ్ సామగ్రి, యంత్రాలు, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.5 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
దర్యాప్తు ప్రకారం.. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు మందులను కొనుగోలు చేసి, వాటిని కొత్త ప్యాకేజింగ్‌లోకి మార్చి వేర్వేరు పేర్లతో విక్రయించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రముఖ ఔషధ సంస్థల పేర్లను పోలిన నకిలీ లేబుళ్లు కూడా గుర్తించినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న మందుల నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ఈ కేసు దర్యాప్తు మరింత విస్తరించడంతో పలు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లోనూ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!