
సినిమాలు

దేశ రాజధాని ఢిల్లీలోని పలు పాఠశాలలకు మరోసారి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెదిరింపు సమాచారం అందిన వెంటనే సంబంధిత పాఠశాలల వద్ద భద్రతా చర్యలు చేపట్టి, పోలీసు బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. పాఠశాల ప్రాంగణాల్లో అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఈ బెదిరింపులు ఫేక్‌వని పోలీసులు నిర్ధారించారు.
ఢిల్లీలోని పాఠశాలలకు తరచూ ఇలాంటి బెదిరింపు ఈమెయిళ్లు రావడం ఆందోళనకు కారణమవుతోంది. గత వారంలోనూ బాంబు బెదిరింపులు రావడంతో పలు పాఠశాలల్లో తరగతులను రద్దు చేసి విద్యార్థులు, సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను పోలీసులు ఇంకా గుర్తించలేకపోయారు. ఈమెయిళ్ల మూలాన్ని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!