
జనరల్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఆయన తదుపరి న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో దానం నాగేందర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు దానం నాగేందర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన వర్గాలు తెలిపినట్లు సమాచారం. దానం నాగేందర్ 2023లో బీఆర్‌ఎస్ టికెట్‌పై ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. ఈ పార్టీ ఫిరాయింపుపై దాఖలైన పిటిషన్లలో హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!