

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2024 సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆగస్టు 21న తీర్పును రిజర్వ్ చేసింది. తొలుత సెప్టెంబర్ 16న తీర్పు ఇవ్వాల్సి ఉండగా, దాన్ని సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ తరఫు పిటిషనర్లు.. కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా దానం నాగేందర్ స్వచ్ఛందంగా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకున్నారని వాదించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!