

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందంటూ వస్తున్న హెచ్చరికలు అర్థరహితమైనవని మాజీ ఇన్ఫోసిస్ సీఈఓ, హ్యాంగ్ టెన్ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు విశాల్ సిక్కా అన్నారు. ఏఐ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోదని, దాన్ని ఉపయోగించే వ్యక్తులు ఇచ్చే సూచనలు, నిర్ణయాల ఆధారంగానే దాని ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల ఏఐ భద్రత, అభివృద్ధి వేగంపై ఆంత్రోపిక్, ఓపెన్ఏఐ సహా ప్రముఖ సంస్థల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిక్కా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
శక్తివంతమైన ఏఐ మోడళ్లను సరైన శిక్షణ, అవగాహన లేని వ్యక్తులు దుర్వినియోగం చేసినప్పుడే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని సిక్కా అభిప్రాయపడ్డారు. మోడళ్ల సామర్థ్యాలపై అనవసరమైన భయాలను పెంచడం కంటే, ఏఐ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ అభివృద్ధిని నెమ్మదించాల్సిన సమయం కాదని, సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడం, తగిన నియంత్రణలు పాటించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!