

సౌదీ అరేబియాపై హూతీల దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని హూతీల పొలిటికల్ బ్యూరో సభ్యుడు మొహమ్మద్ అల్ బుఖైతీ తెలిపారు. సౌదీ అరేబియాకు మద్దతుగా ఇతర దేశాలు యెమెన్ ఘర్షణలోకి రావద్దని ఆయన హెచ్చరించారు. బాబ్ అల్-మండేబ్ జలసంధి వైపు హూతీల దళాలు ముందుకు సాగిన నేపథ్యంలో అమెరికా, హూతీల మధ్య ఒమన్ మధ్యవర్తిత్వంతో సంప్రదింపులు జరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్‌తో కలిపే కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్-మండేబ్ జలసంధిని మూసివేయాలనే ఉద్దేశం తమకు లేదని బుఖైతీ పేర్కొన్నారు. అయితే సౌదీకి మద్దతుగా ఇతర దేశాలు రంగంలోకి దిగితే ఘర్షణను విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు యెమెన్ రెడ్ సీ తీర ప్రాంతంలో హూతీల దాడులు, సౌదీ లక్ష్యాలపై దాడులు కొనసాగుతుండటంతో ప్రాంతీయ వాణిజ్యం, ఇంధన రవాణా మార్గాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!