

న్యూజిలాండ్ పర్యటనలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు ఆక్లాండ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం (అక్టోబర్ 30) జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో భారత్‌ను 87 పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ (107) సెంచరీతో చెలరేగగా, బెవాన్ జాకబ్స్ (65) అర్ధశతకంతో రాణించాడు. అనంతరం బౌలింగ్‌లో జాకబ్ డఫీ నాలుగు వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. మిచెల్ శాంట్నర్, మాథ్యూ ఫిషర్ చెరో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

260 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. తిలక్ వర్మ (35), నమన్ (28), అభిషేక్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (22), నితీష్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సంజు శాంసన్ (4), ఇషాన్ కిషన్ (0), అక్షర్ పటేల్ (7) నిరాశపరిచారు. చివరి ఓవర్లలో ప్రిన్స్ యాదవ్ (18 నాటౌట్) ఎదురుదాడికి దిగినా ఫలితం లేకపోయింది. దీంతో భారత్ 87 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. సిరీస్‌లో భారత్ 3–1తో ఆధిక్యంలో ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!