
జనరల్

మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న బెలోరా విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఫ్లయింగ్ అకాడమీ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ శిక్షణ కేంద్రానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి తుది అనుమతులు లభించాయి. దీంతో కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే 34 శిక్షణ విమానాలు కేంద్రానికి చేరుకున్నాయి. వచ్చే నెలలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
తొలి బ్యాచ్‌లో సుమారు 180 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. వీరికి 18 నెలల కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ అకాడమీ ద్వారా పైలట్ కావాలనుకునే అభ్యర్థులకు క్రమబద్ధమైన విమాన శిక్షణ అందించనున్నారు. ఈ కేంద్రం ప్రారంభంతో ప్రాంతంలో విమానయాన శిక్షణ సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!