

విద్యార్థులకు చదువుతోపాటు ఉపాధికి అవసరమైన వృత్తి నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ ప్రవీణ్’ పథకాన్ని మరింత విస్తరిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించనున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 515 పాఠశాలల్లో 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
విద్యార్థుల్లో ఆర్థిక పరిజ్ఞానం, వ్యాపార ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్ (NIESBUD) సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. అలాగే, 71 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు చెందిన 2,672 మంది బాలికలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫికేట్లు అందజేయనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!