
జనరల్

విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీ హార్స్ జంక్షన్ సమీపంలోని జె.ఎం. భక్షి కంపెనీ పరిధిలో నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు, సమీప ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!