30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ను టార్గెట్ చేసిన చైనా?

Writer: Chandrika 03:12 PM, 30 అక్టోబర్, 2026
ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ను టార్గెట్ చేసిన చైనా?

అమెరికాకు చెందిన ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా గూఢచర్యానికి పాల్పడినట్లు వచ్చిన కథనం అంతర్జాతీయ టెక్‌ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ది న్యూయార్క్‌ టైమ్స్ కథనం ప్రకారం.. చైనా జాతీయురాలైన అలైస్‌ హువాంగ్‌ (హువాంగ్‌ లీ) అనే మహిళను అమెరికా నిఘా సంస్థలు చైనా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థకు సహకరిస్తున్న వ్యక్తిగా అనుమానించాయి. సింగపూర్‌కు చెందిన డేటా సెంటర్‌ సంస్థ మెగాస్పీడ్‌ ఇంటర్నేషనల్‌లో గతంలో కీలక హోదాలో పనిచేసిన ఆమెకు జెన్సన్‌ హువాంగ్‌తో పరిచయాలు ఉన్నట్లు కథనం పేర్కొంది. ఈ పరిచయాల ద్వారా ఎన్విడియా వ్యాపార కార్యకలాపాలు, కీలక సమాచారాన్ని సేకరించి బీజింగ్‌కు చేరవేసి ఉండొచ్చని అమెరికా నిఘా వర్గాలు అనుమానించినట్లు వెల్లడించింది. అమెరికా ఎగుమతి ఆంక్షలను తప్పించుకుని ఎన్విడియా ఏఐ చిప్‌లను చైనాకు చేరవేస్తోందనే ఆరోపణలతో మెగాస్పీడ్‌ గతంలోనూ అమెరికా అధికారుల పరిశీలనకు వచ్చింది.

ఈ గూఢచర్య వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఏడాది క్రితమే సమాచారం అందినట్లు కూడా ఆ కథనం పేర్కొంది. అయితే జెన్సన్‌ హువాంగ్‌ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. మెగాస్పీడ్‌ ప్రతినిధులతో తనకు ఉన్న పరిచయాలు సాధారణ వ్యాపార సంబంధాల్లో భాగమేనని స్పష్టం చేశారు. ఎన్విడియా అధికార ప్రతినిధి జాన్‌ రిజో మాట్లాడుతూ.. ప్రాంతీయ కస్టమర్లకు సాధారణ వ్యాపార సమాచారాన్ని మాత్రమే అందిస్తామని, కంపెనీ వాణిజ్య రహస్యాలు లేదా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోమని తెలిపారు. మెగాస్పీడ్‌ ద్వారా చిప్‌ల అక్రమ తరలింపునకు ఆధారాలు లభించలేదని సంస్థ పేర్కొంది. మరోవైపు, అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా కొట్టిపారేసింది. మెగాస్పీడ్‌ మాత్రం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, అధికారుల దర్యాప్తునకు సహకరిస్తామని వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు

తుఫాన్‌ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

తుఫాన్‌ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

సీజేపీ నేత సౌరవ్ దాస్ పౌరసత్వంపై హైకోర్టు కీలక ఆదేశాలు

సీజేపీ నేత సౌరవ్ దాస్ పౌరసత్వంపై హైకోర్టు కీలక ఆదేశాలు

టాలీవుడ్‌లో సీనియర్ నటి కన్నుమూత

టాలీవుడ్‌లో సీనియర్ నటి కన్నుమూత

ట్యాగ్లు
ఎన్విడియాజెన్సన్ హువాంగ్చైనా గూఢచర్యంఅలైస్ హువాంగ్మెగాస్పీడ్ ఇంటర్నేషనల్ఏఐ చిప్స్అమెరికా చైనా సంబంధాలుడొనాల్డ్ ట్రంప్టెక్నాలజీ వార్తలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
Advertisement
శ్మశానమే రెండో ఇల్లు.. వందల ఏళ్ల సమాధులకు కొత్త జీవం పోస్తున్న అమెరికా యువతి

శ్మశానమే రెండో ఇల్లు.. వందల ఏళ్ల సమాధులకు కొత్త జీవం పోస్తున్న అమెరికా యువతి

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో మందుబాబులకు షాక్!
జనరల్

ఏపీలో మందుబాబులకు షాక్!

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
జనరల్

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌
జనరల్

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి
ఆరోగ్యం

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్
జనరల్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

కల్ట్ రివ్యూ:  విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?
రివ్యూలు

కల్ట్ రివ్యూ: విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?
గాసిప్స్

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!
రాజకీయాలు

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!