
టెక్నాలజీ

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, NTA ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని వ్యాఖ్యానించింది. గతంలోనే ఈ అంశంపై కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసింది.
రాధాకృష్ణ కమిటీ సిఫార్సుల అమలుకు హైపవర్ కమిటీ తీసుకున్న చర్యలపై మూడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని NTAను ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం ఈ కేసును విచారించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!