
జనరల్

మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పుణే జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం లోనావాలాలో కేవలం 24 గంటల్లో 670 మిల్లీమీటర్లు (67 సెం.మీ) రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భిరా, తంహిని ప్రాంతాల్లో కూడా 500 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడంతో నదులు, వాగులు ఉప్పొంగి వరద పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఈ ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్న వరద నీరు భీమా నది ద్వారా జూరాల ఎగువన కృష్ణా నదిలోకి చేరుతోంది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టుకు ప్రస్తుతం సుమారు 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!