
జనరల్

'మైసాక్' తుఫాన్ ప్రభావంతో చైనాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నానింగ్ నగరంలో రిజర్వాయర్ తెగిపోవడంతో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించి కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గత 24 గంటల్లో 74.5 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ప్రకృతి విపత్తులో ఇద్దరు మృతి చెందగా, సుమారు 50 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా, నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!